calender_icon.png 9 March, 2025 | 6:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆగని రెస్క్యూ ఆపరేషన్!

09-03-2025 12:32:49 AM

  1. జీపీఆర్ రాడార్, కేరళ జాగిలాలు గుర్తించిన ప్రదేశాల్లో ముమ్మరంగా తవ్వకాలు
  2. 50 మీటర్ల వద్ద డేంజర్ జోన్‌గా గుర్తింపు 
  3. ఆ ప్రదేశంలో రోబోలను రంగంలోకి..
  4. ఇలాంటి ప్రమాదం ప్రపంచంలోనే మొదటిది: ఉత్తమ్

నాగర్‌కర్నూల్, మార్చి 8 (విజయక్రాం తి): శ్రీశైలం ఎడమ గట్టు టన్నెల్ ప్రమాదం జరిగి 15 రోజులు గడుస్తున్నది. సహాయక చర్యలు జరుగుతున్న ప్రదేశంలో ఆక్సిజన్ స్థాయిలు పూర్తిగా తగ్గడంతో సహాయక బృం దాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయి. ప్రధానంగా 13.6 మీటర్ల నుంచి దుర్వాసన రావడంతో కార్మికుల రెస్క్యూ ఆపరేషన్‌కు ఆటంకం ఏర్పడుతున్నది.

అయినా శనివా రం కత్తిరించిన టీబీఎం శకలాలను రెస్క్యూటీమ్ భుజాలపై తీసుకెళ్లి లోకో ట్రైన్ ద్వారా బయటికి తరలించారు. నీరు, బురద తోడివేత ప్రక్రియ వేగంగా జరుగుతుండటంతో సహాయక చర్యలు మరింత వేగవంతం చేశా రు. జీపీఆర్ రాడార్ ద్వారా గుర్తించిన ప్రదేశాల్లోనే తవ్వకాలు చేపట్టారు. సొరంగంలోని 14వ కిలోమీటర్ వద్ద 8 మంది కార్మికులు బురదలోనే చిక్కుకొని ఉంటారని రెస్క్యూ టీం బృందాలన్నీ తేల్చి చెప్పాయి.

అయితే బురదను కదిలిస్తే మరింత ప్రమాదం పొంచి ఉండటంతో ప్రాణ నష్టం జరగకుం డా రోబో యంత్రాల ద్వారా సొరంగంలోని మట్టిని తవ్వి కార్మికులను గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి రోబో నిపుణుల బృం దం వివరించింది.

13.6 కిలోమీటర్ల వరకు సహాయక చర్యలు జరుగుతున్నాయని, ఆ తర్వాత 50 మీటర్ల ప్రాంతంలో మాత్రమే అత్యంత ప్రమాదకర పరిస్థితులు నెలకొని ఉన్నాయని నిపుణుల బృందం తెలిపింది. ప్రాణం నష్టం జరిగే ఆస్కారం ఉన్న నేపథ్యంలోనే ఆదివారం నుంచి రోబో యంత్రాలను వినియోగించనున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమా ర్‌రెడ్డి తెలిపారు.