calender_icon.png 15 January, 2025 | 7:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాన్ స్టాప్ నవ్వుల మజాకా

13-01-2025 12:00:00 AM

సందీప్ కిషన్ ల్యాండ్‌మార్క్ 30వ సినిమా ‘మజాకా’కు త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నారు.  రాజేశ్ దండా, ఉమేశ్ కేఆర్ బన్సాల్ నిర్మిస్తున్నారు. రీతువర్మ హీరోయిన్. ఫిబ్రవరి 21న ఈ చిత్రం విడుదల కానుంది. మేకర్స్ ఆదివారం ఈ సినిమా టీజర్‌ను లాంచ్ చేశారు. హైదరాబాద్‌లో జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. “నా నుంచి మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని కోరుకుంటున్నారని ప్రేక్షకులతో మాట్లాడినప్పుడు తెలిసింది.

వారు కోరుకున్న సినిమా చేయడం నా బాధ్యత. అలాంటి సమయంలోనే ‘మజాకా’ నా దగ్గరకు వచ్చింది” అన్నారు. హీరోయిన్ అన్షు మాట్లాడుతూ.. ‘22 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ సినిమాతో అందరినీ కలుసుకోవడం సంతోషంగా ఉంది’ అన్నారు.

డైరెక్టర్ త్రినాథ్ మాట్లాడుతూ.. “మజాకా’ నాకు చాలా ఇష్టమైన కథ. రీలీజైన తర్వాత సీట్లు కాదు గేట్లు పగులుతాయనిపిస్తోంది. అంత కామెడీ ఉంటుందీ సినిమాలో’ అన్నారు. నిర్మాత రాజేశ్ దండా మాట్లాడుతూ.. ‘మజాకా కథ వినప్పుడు నాన్ స్టాప్‌గా రెండు గంటలు నవ్వుకుంటూనే ఉన్నా. నా బ్యానర్‌కు వందకోట్ల సినిమా అని బలంగా నమ్ముతున్నాను’ అన్నారు. రైటర్ ప్రసన్న, యాక్టర్ రావు రమేశ్, డీవోపీ నిజార్ షఫీ తదితరులు పాల్గొన్నారు.