calender_icon.png 25 January, 2025 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెండింగ్ వేతనాలు చెల్లించకుంటే నిర్వాదిక సమ్మె తప్పదు..

24-01-2025 08:11:59 PM

సిఐటియు పట్టణ కన్వీనర్ ఎంబి నర్సారెడ్డి....

భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్, ఉద్యోగులు కార్మికులకు రావలసిన వేతనాలను ఫిబ్రవరి ఒకటో తారీకు నాటికి విడుదల చేయకపోతే ఫిబ్రవరి 2 నుండి సిఐటియు ఆధ్వర్యంలో నిర్వాదిక సమ్మెకు దిగుతామని సిఐటియు పట్టణ కన్వీనర్ ఎంబి నర్సారెడ్డి హెచ్చరించారు. శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో కార్మికుల వేతనాల విడుదల కోసం ఏరియా హాస్పిటల్ ఆర్ఎంఓ సంతోస్ కి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా సిఐటియు పట్టణ కన్వీనర్ ఎంబి నర్సారెడ్డి మాట్లాడుతూ... ఏరియా హాస్పిటల్ లో  వివిధ వి భాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, కార్మికులు సుమారు వందమంది ఉన్నారని అన్నారు. ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులకు ఐదు నెలలుగా వేతనాలు లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కార్మికుల గోడు పట్టించుకునే నాధుడే లేడని ఆరోపించారు.

జిల్లా కలెక్టర్ నుంచి సూపర్డెంట్ దాకా అందరికీ వినతి పత్రాలు ఇచ్చిన స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేకి ఎంపీ బలరాం నాయక్ కి వినతిపత్రాలు ఇచ్చినా అదేవిధంగా మంత్రులకు ఇచ్చిన కార్మికుల సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాలే కడుపులతో పస్తులు ఉంటూ హాస్పటల్ ఎమర్జెన్సీ అని చెప్పి పని చేస్తున్నా అధికారులకు గాని ప్రజాప్రతినిలో గాని కార్మికులపై దయ కలగడం లేదని ఇటువంటి అనువర్యా పరిస్థితుల్లో ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు వేచి ఉండి ఆలోపు జీతాలు రాకపోతే ఫిబ్రవరి 2వ తేదీ నుండి నిరవధిక సమ్మెకు దిగుతారని నర్సారెడ్డి హెచ్చరించారు.  ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు ఈ విషయంలో జోక్యం చేసుకొని వెంటనే కార్మికుల వేతనాల సమస్యను పరిష్కరించాలని వారికి జీతాలు వచ్చే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రమా, రమణ, కృష్ణ, రమేష్, నాగరాజు, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.