calender_icon.png 1 February, 2025 | 11:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీలకతీతంగా అభివృద్ధి

26-01-2025 12:34:22 AM

ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి 

మేడ్చల్, జనవరి 25(విజయ క్రాంతి): గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీలో పార్టీల కతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. శనివారం గుండ్ల పోచంపల్లిలో 9వ వార్డులో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో సిసి రోడ్లు, మురుగు కాలువలకు నిధులు మంజూరయ్యాయన్నారు.

మున్సిపల్ చైర్ పర్సన్ మద్దుల లక్ష్మి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఐదేళ్ల కాలంలో మున్సిపాలిటీని అన్ని రంగాలలో అభివృద్ధి చేశామన్నారు. అభివృద్ధిక సహకరించిన నాయకులకు, పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కండ్లకోయ కౌన్సిలర్ సముద్రాల హంస రాణి కృష్ణ గౌడ్ మాట్లాడుతూ ప్రజల ఆకాంక్ష మేరకు వార్డును అభివృద్ధి చేశానన్నారు.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ రామన్న గారి ప్రభాకర్, గుండ్ల పోచంపల్లి మాజీ సర్పంచ్ మద్దుల శ్రీనివాసరెడ్డి, బిజెపి నాయకుడు అమర మోహన్ రెడ్డి, కౌన్సిలర్ అమరం హేమంత్ రెడ్డి, పెంటయ్య ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.