- ఈ ఏడాది 42 మందికి మాత్రమే జాబ్ లెటర్స్
- ఆదరణ కోల్పోతున్న శాఖ, తగ్గుతున్న రిజిస్ట్రేషన్లు
- ఎంప్లాయ్‌మెంట్ కార్డు ప్రామాణికం కాకపోవడంతో సమస్య
మెదక్, నవంబర్ 1౪(విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఎంప్లాయ్‌మెం ట్ కార్డు ప్రామాణికం కాకపోవడంతో ఉపాధిశాఖ ఆదరణ కోల్పోతుంది. అవుట్ సోర్సింగ్‌లోనూ అభ్యర్థుల ఎంపికలో ఆ శాఖకు ప్రమేయం లేకపో వడంతో ఆ శాఖ నిర్వీర్యమవుతోంది. ప్రైవేట్ సంస్థలు నిర్వహిస్తున్న జాబ్‌మేళాలకు కూడా పెద్ద స్పందన లేకపోవడంతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు.
2017లో అందుబాటులోకి
జిల్లాలో 2017లో జిల్లా ఉపాధి కార్యాలయం అందుబాటులోకి వచ్చింది. కార్యాల యంలో జిల్లా ఉపాధి అధికారితో పాటు జూనియర్ ఉపాధి అధికారి, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, అటెండర్ ఉండాలి. కానీ కేవలం జిల్లా ఇన్‌చార్జి మాత్రమే ఉన్నారు. కాగా గతంలో ఎంప్లాయిమెంట్ సీనియారిటీ ప్రకారం నియామ కాలు చేపట్టేది.
అయితే ప్రస్తుతం పరీక్షలను మాత్రమే ప్రామాణికంగా తీసుకోవడంతో క్రమక్రమంగా ఆదరణ తగ్గుతోంది. దీనికి తోడు జిల్లాలో కేవలం 5,192 మంది నిరుద్యోగులు మాత్రమే ఉపాధి కార్యాలయంలో తమ పేర్లను నమోదు చేసుకున్నారు. కొత్త రిజిస్ట్రేషన్లు క్రమేపీ తగ్గుతున్నాయి. పాత వారు రెన్యువల్ చేసుకునేం దుకు ఆసక్తి చూపడం లేదు.
అవగాహన కార్యక్రమాలు అంతంతే
ఎంప్లాయిమెంట్ కార్డు, ఉపాధి అవకాశాలపై అధికారులు నెలలో రెండుసార్లు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. కానీ అధికారులు రెండు, మూడు నెలలకోసారి నిర్వహించి చేతులు దులుపుకుం టున్నారు. ఈ కారణంగా రిజిస్ట్రేషన్ల సంఖ్య కూడా పెరగడం లేదు. 2019కు ముందు ఉపాధి శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేవారు.
కరోనా నుంచి ఆ శిక్షణా కేంద్రాలు కూడా కనుమరుగయ్యాయి. శిక్షణ, ఉపాధి అవకాశాలు లేక ఆ శాఖ కార్యక్రమాలపై యువత ఆసక్తి చూపడం లేదు. జిల్లాలో ఈ ఏడాది కేవలం 42 మందికే ప్రైవేట్ ఉద్యోగావకాశాలు కల్పించగలిగారు. వీరిలో ఎంతమంది ఉద్యోగంలో చేరారన్న విషయమై స్పష్టత లేదు.
టామ్‌కామ్‌కు కూడా స్పందన కరువు
రాష్ట్రస్థాయిలో ఉపాధిశాఖ ఆధ్వర్యంలో టామ్‌కామ్ ద్వారా విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. అయితే పాస్‌పోర్ట్ కలిగి ఉండి.. ఉద్యోగానికి సంబంధించిన విద్యార్హతలు ఉండాలి. ప్రభుత్వ ఖర్చులతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని ప్రచా రం చేస్తున్నారు.
స్పెషల్ డ్రైవ్ ద్వారా ఉద్యోగాల భర్తీ చేసి అమెరికా లాంటి దేశాలకు పంపిస్తున్నారు. అయితే వేతనాలు తక్కువగా ఉండటం, పలు సమస్యలు కారణంగా ఈ కార్యక్రమానికి ఆదరణ కరువైం ది. మెదక్ జిల్లా నుంచి 2023-24 ఏడాదిలో కేవలం ముగ్గురిని మాత్రమే విదేశాలకు పంపారు.
కార్డును ప్రామాణికంగా తీసుకోవాలి
ఉద్యోగాల భర్తీలో ఎంప్లాయ్‌మెం ట్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటే ఉపాధి శాఖకు ఆదరణ లభి స్తుంది. సీనియారిటీ ప్రకారం గతంలో ఉద్యోగాలు భర్తీ చేసేవారు. అవుట్ సోర్సింగ్‌లోనూ ఏజెన్సీల ఎంపిక తప్ప, ఉద్యోగాల భర్తీలో ప్రమేయం లేదు. ప్రత్యేకంగా మెదక్ జిల్లాలో ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉండటంతో యువత ఆసక్తి చూపడం లేదు. ఉన్న ఉద్యోగాలను సైతం జిల్లాలోనే కేటాయించాలని కోరుతున్నారు.
- రామరాజు,
జిల్లా ఉపాధి కల్పనాధికారి