03-02-2025 01:32:36 AM
త్రివేండ్రం, ఫిబ్రవరి 2: యోగా గురు వు, పతంజలి ఆయుర్వేద సంస్థ అధినేత రాందేవ్‌బాబా, ఎండీ బాలకృష్ణకు కేరళలోని పాలక్కాడ్ జిల్లా కోర్టు ఆదివారం నాన్‌బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పతంజలి సంస్థకు చెందిన ‘దివ్య ఫార్మాసిటీ’ వైద్యవిధానాలు తప్పు దోవపట్టించేలా ఉన్నాయని కేరళకు చెందిన డ్రగ్ ఇన్‌స్పెక్టర్ క్రిమినల్ కేసు పెట్టారు. ఈ కేసులో శనివారం (ఫిబ్రవరి 1)న రాం దేవ్‌బాబా, బాలకృష్ణ విచారణకు హాజరుకావాలని పాలక్కాడ్ కోర్టు నోటీసులు ఇచ్చింది. కాని వారిద్దరూ గైర్హాజరు కావడంతో కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. విచారణను ఈ నెల 15కు వాయిదా వేసింది.