వనపర్తి టౌన్, జనవరి 29: రైతు భరోసా సర్వే సందర్భంగా వనపర్తి జిల్లాలో గుర్తిం చిన వ్యవసాయేతర భూమిని ఆన్లైన్‌లో నిక్షిప్తం చేసి ఫ్రీజ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం ఉదయం కలక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుండి తహశీల్దార్లు, మండల వ్యవసాయ అధికారు లతో వెబ్ కాందరెన్స్ ద్వారా సమీక్ష నిర్వ హించారు. ప్రభుత్వం ద్వారా రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జామచేసే ప్రక్రి య ప్రారంభమైందని, అర్హులైన ప్రతి రైతు కూ రైతు భరోసా అందేవిధంగా చూడాల న్నారు.
రేషన్ కార్డుల విషయంలో ఏదైతే కొత్త దరఖాస్తులు, ఫిర్యాదులు వచ్చాయో వాటిని క్షుణ్ణంగా పరిశీలించి రేషన్ కార్డుకు అర్హులైన జాబితాను సిద్ధం చేసుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీ స్ సంచిత్ గంగ్వార్, అదనపు కలెక్టర్ రెవె న్యూ జి. వెంకటేశ్వర్లు, వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్, తహసిల్దార్ మదన్ మో హన్, అందరూ తహశీల్దార్లు, మండల వ్యవ సాయాధికారులు తదితరులు పాల్గొన్నారు.