calender_icon.png 3 February, 2025 | 4:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచి 10 వరకు నామినేషన్ల స్వీకరణ

03-02-2025 12:00:00 AM

కరీంనగర్, ఫిబ్రవరి 2 (విజయ క్రాంతి): కరీంనగర్-మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపా ధ్యాయ శాసనమండలి సభ్యుల నామి నేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 3వ తేదీ నుం చి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 10 వరకు కరీంనగర్ కలెక్టరేట్ కార్యాల యంలో నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల పరిశీలన ఫిబ్రవరి 11న ఉండగా, 18న ఉపసంహరణ ఉంటుంది.

ఉపసంహరణ అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల తుదిజాబితాను ప్రక టిస్తారు. ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 8న ఓట్ల లెక్కింపు ఉంటుంది. పట్టభ ద్రుల, ఎమ్మెల్సీ పరిధి 13 జిల్లాలకు విస్తరించి ఉంది. కౌంటింగ్ పూర్తయ్యే మార్చి 11 వరకు ఎన్నికల కోడ్ అమ లులో ఉండనుంది. పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి 499 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

మొత్తం 3,41,313 మంది ఓటర్లు ఉన్నారు. ఉపాధ్యాయ నియోజక వర్గానికి సంబంధించి 274 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 25,921 మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉన్నారు. నామినేషన్ల దరఖాస్తు ప్రా రంభమయ్యే ఫిబ్రవరి 3న వసంత పంచమి కావడంతో తొలిరోజు ఎక్కు వ నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది.