calender_icon.png 8 February, 2025 | 12:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒకేరోజు 30 నామినేషన్లు

08-02-2025 01:26:19 AM

*  భారీ ప్రదర్శనతో తరలివచ్చిన నేతలు

కరీంనగర్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజ కవర్గాలకు శుక్రవారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఒక్క పట్టభద్రుల నియో జకవర్గానికే 28 మంది నామినేషన్లు దాఖలు చేయగా, ఉపాధ్యాయ నియోజకవ ర్గానికి రెండు నామినేషన్లు దాఖలయ్యాయి.

ఇప్పటి వరకు పట్టభద్రుల నియోజకవ ర్గానికి 49, ఉపాధ్యాయ నియోజకవర్గానికి 9, మొత్తంగా 58 నామినేషన్లు దాఖలయ్యా యి. శనివారం, ఆదివారం సెలవు దినాలు కావడంతో నామినేషన్ల ఘట్టం చివరి రోజైన సోమవారం కూడా భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. పట్టభద్రుల నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థి చిన్నమైలు అంజిరెడ్డి భారీ ప్రదర్శనతో వచ్చి నామినే షన్ దాఖలు చేశారు.

అంజిరెడ్డి వెంట కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్రావు, సీనియర్ నాయకులు బాస సత్యనారాయణ, తదిత రులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ వి నరేందర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి నామినేషన్ దాఖలు చేయగా, స్వతం త్ర అభ్యర్ధిగా బరిలో ఉంటున్న ప్రసన్న హరి కృష్ణ భారీ ప్రదర్శనతో వచ్చి నామినేషన్ దాఖలు చేశారు.

మహ్మద్ ముస్తాక్ అలీ ఎంఐఎం నేతలు, మైనార్టీ నాయకులతో కలిసి వచ్చి నామినేషన్ దాఖలు చేశారు. మాజీ డీఎస్పీ మదనం గంగాధర్ అనుచరు లతో తరలివచ్చి నామినేషన్ దాఖలు చేశారు. వీరితోపాటు శుక్రవారం పట్టభద్రు ల నియోజకవర్గానికి నామినేషన్ దాఖలు చేసినవారిలో దయ్యాల ఓంప్రకాశ్, డాక్టర్ బండారి రాజ్ కుమార్, యాదగిరి శేఖర్రా వు, డాక్టర్ రాపాల రాజు, న్యాంతాబాద్ జనార్ధన్, సంకినేని మధుసూదన్ రావు, బక్వాడ బాలాజీ, సిలివేరి శ్రీకాంత్, వేముల కరుణాకర్ రెడ్డి, మొక్కు హేమలత పటేల్, చందా సాయికుమార్, ఎనరెల్లి సాయిబా బా, సర్దార్ రవీందర్ సింగ్, వేముల విక్రమ్ రెడ్డి, అబ్బగోని అశోక్ గౌడ్, దార మనోహ ర్, లింగం కృష్ణ, శనిగరపు రమేష్ బాబు, సీహె పురుషోత్తం, ఎస్ శ్రీనివాస్, జెడ్సన్ బక్క, అంగ సంపత్ యాదవ్, ఆచారం చంద్రశేఖర్, పెద్దపల్లి సత్యనారాయణ, జావీద్ అహ్మద్, సోముగాని నరేందర్, బడే నర్సయ్య, దేవనూరి రవీందర్ లు ఉన్నారు.

వీరిలో ఐదుగురు ఇదివరకే నామినేషన్ దాఖలు చేసినవారిలో ఉన్నారు. ఉపాధ్యా య నియోజకవర్గానికి ముత్తారం నర్సింహ స్వామి, వంగ మహేదర్ రెడ్డిలు నామినేషన్ దాఖలు చేశారు. ఉపాధ్యాయ నియోజకవ ర్గం నుంచి బీజేపీ తరపున మల్క కొముర య్య మరోసెట్ నామినేషన్ వేశారు.

గెలుపుపై ఎవరి ధీమా వారిది...

భారీ ప్రదర్శనలతో నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు గెలుపుపై ఎవరి ధీమా వారు వ్యక్తం చేశారు. అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి తాను గెలిచి సోనియా గాంధీకి గిఫ్ట్ ఇస్తానని, పట్టభద్రుల సంక్షేమానికి, నిరు ద్యోగ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి మాట్లా డుతూ గత బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించడం లేదని, తాను గెలిస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని అన్నారు.

ఎంఐఎం నేతలతో కలిసి నామినేషన్ దాఖ లు చేసిన ముస్తాక్ అలీ నిరుద్యోగులకు నైపు ణ్య శిక్షణ కల్పించడంతోపాటు వారి సంక్షే మానికి కృషి చేస్తానన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా రాజీనామా చేసి బరిలో దిగుతు న్న ప్రసన్న హరికృష్ణ పట్టభద్రుల కోసం ప్రశ్నించే గొంతుకనవుతానని అన్నారు. డీఎ స్పీగా రాజీనామా చేసి నామినేషన్ దాఖలు చేసిన గంగాధర్, బీఆర్‌ఎస్ నాయకులు సర్దార్ రవీందర్ సింగ్ లు గెలుపుపై ఎవరికి ధీమా వారు వ్యక్తం చేశారు.