11-03-2025 12:42:09 AM
హైదరాబాద్, మార్చి 10 (విజయక్రాంతి): ఎమ్మెల్యే కోటాలోని ఐదు ఎమ్మె ల్సీ స్థానాలకు గాను కాంగ్రెస్, సీపీఐ, బీఆర్‌ఎస్ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్‌నాయక్, సీపీఐ అభ్యర్థి నెల్లికంటి సత్యం, బీఆర్‌ఎస్ అభ్యర్థి దాసో జ్ శ్రావణ్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో అసెంబ్లీ ప్రాంగణం మొత్తం కోలాహలంగా మారింది.
కాంగ్రెస్, సీపీఐ అభ్యర్థులకు మద్దతుగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమా ర్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, బీర్ల అయిలయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
ఇక బీఆర్‌ఎస్ అభ్యర్థి దాసోజ్ శ్రావణ్ నామినేషన్ కార్యక్రమానికి ఆ పార్టీ వర్కిం గ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్‌రావుతో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నాయకులు హాజరయ్యారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్యా బలాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీకి నాలుగు ఎమ్మెల్సీ స్థానాలు, బీఆర్‌ఎస్‌కు ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కనుంది.
ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ అభ్యర్థి విజయానికి 21 మంది ఎమ్మెల్యేల ఓట్లు అవ సరం ఉంటుంది, కాగా, 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలవగా.. వారిలో 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
దీంతో ఆ పార్టీకి రెండో అభ్యర్థిని నిలబెట్టే అవకాశం లేకుండాపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీకి 64 మంది ఎమ్మెల్యేలు, సీపీఐకి ఒక ఎమ్మెల్యే విజయం సాధించిన విషయం తెలిసిందే. బీజేపీ నుంచి 8 మంది, ఎంఐఎం పార్టీకి ఏడుగురు ఎమ్మెల్యేలే ఉండటంతో ఎన్నికకు దూరంగా ఉన్నాయి.
ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు..
ఎమ్మెల్సీగా స్వతంత్ర అభ్యర్థులుగా ఆరుగురు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో కంటే సాయన్న, చంద్రశేఖర్ చాలిక, జాజుల భాస్కర్, బోగ తిలక్, శ్రీకాంత్ సిలివేరు, బోయరాజు కోయల్కర్ ఉన్నారు.
ప్రజలు ఇచ్చిన గుర్తింపు: దయాకర్
ఎమ్మెల్సీగా తనకు అవకాశం రావడంతో చాలా మంది వాళ్ల బిడ్డలకు పదవీ వచ్చినట్లుగానే ఆనందపడుతున్నారని, తాను చేసిన సేవలకు ప్రజలు ఇచ్చిన గుర్తింపుగా భావిస్తున్నట్లు అద్దంకి దయాకర్ అన్నారు.
పార్టీ కోసం పనిచేస్తే అవకాశం దక్కుతుంది : విజయశాంతి
ఒక ఆలోచన, ముందుచూపుతోనే రాష్ట్ర ప్రజల కోసం పలు సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి విజయశాంతి అన్నారు. ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా ప్రభుత్వం నేరవేర్చుతుందని తెలిపారు. ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన అనంతరం విజయశాంతి మీడియాతో మాట్లాడుతూ.. తాను గతంలో కాంగ్రెస్ పార్టీలో పని చేశానని తెలిపారు. కానీ, తనకు ఇది కావాలని పార్టీని అడగలేదన్నారు. పార్టీ అవకాశం ఇచ్చే వరకు పనిచేయాలని తా ను అనుకున్నానని, అవకాశం కోసం ఎదురుచూసినట్లు చెప్పారు.