18-02-2025 01:24:33 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 17(విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీకి నామినేషన్ల గడు సోమవారంతో ముగిసింది. మొత్తం 17 నామినేషన్లు దాఖలయ్యా స్టాండింగ్ కమిటీకి 15మంది కంటే ఎక్కువ నామినేషన్లు వస్తే ఈ నెల 25న ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి ఏడుగురు, ఎంఐఎం నుంచి 8 మంది, బీఆర్‌ఎస్ నుంచి ఇద్దరు కార్పొరేటర్లు నామినేషన్ సమర్పించారు.
జీహెచ్‌ఎంసీలో మొత్తం 15 మంది ఉండే స్టాండింగ్ కమిటీ సభ్యుల్లో గతంలో బీఆర్‌ఎస్ నుంచి 8 మంది, ఎంఐఎం నుంచి ఏడుగురు సభ్యులుండేవారు. ఎన్నికల అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం స్టాండింగ్ కమిటీకి నామినేషన్లు వేశారు. ఈ నెల 21న నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ కాగా, 25న ఎన్నికలు ఉండే అవకాశం ఉంది. జీహెచ్‌ఎంసీలో మొత్తం 150 కార్పొరేటర్లకు ప్రస్తుతం 146 మంది ఉన్నారు. ఇద్దరు మరణించగా, మరో ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. కాగా ఎన్నికలు ఉంటాయా, ఏకగ్రీవమవుతాయా అనేది వేచి చూడాలి.