10-03-2025 09:17:58 AM
హైదరాబాద్: తెలంగాణలో నేటితో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ నామినేషన్(MLA quota MLCs Nomination) దాఖలు ప్రక్రియ ముగియనుంది. ఇవాళ సీపీఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం నామినేషన్ వేయనున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఒక స్థానం సీపీఐకి కేటాయించింది. సత్యం నల్గొండ జిల్లా సీపీఐ కార్యదర్శి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు. నేడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ కార్యక్రమంలో కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు పాల్గొనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్‌నాయక్ నామినేషన్ దాఖలు చేయనున్నారు.