calender_icon.png 7 November, 2024 | 6:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సోషల్ మీడియా కో ఆర్డినేటర్లకు నామినేటెడ్ పదవులు?

04-11-2024 02:31:12 AM

సీఎం, మంత్రి కొండా సురేఖకు పీసీసీ చీఫ్ లేఖలు

హైదరాబాద్, నవంబర్ 3 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా వారియర్లకు రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ అందించబోతుంది. తెలంగాణలోని దేవాలయ కమిటీలు, ట్రస్టు బోర్డుల్లో సోషల్ మీడియా కో ఆర్డినేటర్లను నియమించాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డికి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ లేఖలు రాశారు.

ఈ లేఖపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సురేఖ సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది. అదే జరిగితే సోషలమ్ మీడియా కో ఆర్డినేటర్లకు కూడా పార్టీ నాయకులకు మాదిరిగానే నామినేటెడ్ పదవుల భాగ్యం దక్కునుంది. ప్రస్తుత రాజకీయాల్లో, ఎన్నికల సమరంలో రాజకీయ పార్టీలకు సోషల్ మీడియా వింగ్‌లు బలమైన పాత్రను పోషిస్తున్నాయి.

నిత్యం ప్రత్యర్థి పార్టీల వైఫల్యాలను ఎండగడుతూ, సొంత పార్టీ విజయం కోసం ప్రజల దృష్టిని ఆకర్షించడంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు బలమైన సోషల్ మీడియా విభాగాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి సోషల్ మీడియానే ప్రధాన కారణమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే.