26-04-2025 12:00:00 AM
15వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్- 2025కు ‘క’ సినిమా నామినేట్ అయ్యింది. కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన ఈ ఫాంటసీ థ్రిల్లర్ మూవీని నూతన దర్శక ద్వయం సుజిత్, సందీప్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో నయన్ సారిక, తన్వీరామ్ హీరోయిన్లు. నిరుడు దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుచి మంచి స్పందన దక్కింది.
కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌కు నామినేట్ అయిన విషయాన్ని చిత్రబృందం తాజాగా సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. “సిల్వర్ స్క్రీన్ నుంచి ప్రెస్టీజియస్ స్టేజీల వరకు.. యంగ్ టీమ్‌కు ఇది నిజమైన విజయం.
‘క’ రాంపేజ్ కొనసాగుతోంది” అని మేకర్స్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ఈ మూవీ బెస్ట్ ఫిలిం క్యాటగిరీలో నామినేట్ అయినట్లు తెలుస్తోంది. ఢిల్లీ వేదికగా ఈ నెలాఖరున జరగనున్న వేడుకల్లో విజేతలకు పురస్కా రాలు అందించనున్నారు.