calender_icon.png 12 October, 2024 | 11:52 AM

అణు ముప్పుపై చైతన్యానికి నోబెల్

12-10-2024 01:05:25 AM

  1. జపాన్‌లోని హిడంక్యో సంస్థకు శాంతి పురస్కారం
  2. కరోలిన్‌స్కా నోబెల్ కమిటీ ప్రకటన
  3. హిరోషిమా, నాగసాకి బాధితుల సంస్థకు గౌరవం

స్టాక్‌హోం, అక్టోబర్ 11: నోబెల్ శాంతి బహుమతిని ఈ ఏడాది వ్యక్తికి కాకుండా జపాన్‌లో అణు ముప్పునకు వ్యతిరేకంగా పోరాడు తున్న సంస్థకు ప్రకటించారు. ప్రపంచాన్ని అణ్వాయుధ రహితంగా మార్చేందుకు ప్రయ త్నం చేస్తున్న నిహన్ హిడంక్యో సంస్థకు ఈ ఏడాది నోబెల్ వరించింది.

నాగసాకి, హిరోషిమా విధ్వంసాలను దృష్టిలో పెట్టుకుని అలా ంటి దారుణం మరోసారి జరగకూడదనే ఉద్దేశంతో హిడంక్యో పనిచేస్తోందని స్టాక్‌హోంలో ని కరోలిన్‌స్కా నోబెల్ కమిటీ వెల్లడించింది. ఈ సంస్థ చేస్తున్న కృషికి గాను నోబెల్ పురస్కారాన్ని ప్రకటిస్తున్నట్లు కమిటీ ప్రకటించింది. 

అణురహిత ప్రపంచం కోసం..

హిరోషిమా, నాగసాకిపై అమెరికా చేసిన అణుదాడిలో దెబ్బతిన్న బాధితుల కోసం నిహన్ హిడంక్యో సంస్థ పనిచేస్తోంది. ఈ సంస్థకు హిబకుషా అనే మరో పేరుతోనూ వ్యవహరిస్తారు. అణు రహిత ప్రపంచం కోసం ఈ సంస్థ కృషి చేయడంతో పాటు అణు దాడుల నుంచి ప్రాణాలతో బయటినవారికి సేవలు అందిస్తోంది. అణ్వాయుధాలను మరోసారి వాడకూడదని బాధితులతో కలిసి అనేక ప్రదర్శనలు ఇచ్చింది.

హిడాంక్యూ సంస్థ జపాన్‌లోని 47 ప్రిఫెక్చర్లలో అణుదాడి బాధితులు సభ్యులు ఉన్నారు. వీరందరినీ కలిపి హిబకుషాగా పేర్కొంటారు. నోబెల్ ప్రకటన సందర్భంగా కమిటీ మాట్లాడుతూ.. అణుదాడుల్లో ప్రాణాలతో బయటపడినవారిని గౌరవించాలని కోరుకుంటున్నాం. కోల్పోయిన వారి జ్ఞాపకాలు వెంటాడుతున్నప్పటికీ మరొకరికి ఇలాంటి కష్టం రాకూడదనే ఉద్దేశంతో వారు పోరాడుతున్నారు అని వెల్లడించింది.

అణు దాడి బాధితులు కలిసి హిబకుషాను 1956లో స్థాపించారు. ఆ ప్రాంతాల్లో అణుదాడి జరిగిన 11 ఏళ్ల తర్వాత ఈ సంస్థ ఆవిర్భవించింది. అణుదాడి నుంచి తమను తాము రక్షించుకోవడంతో పాటు భవిష్యత్తు తరాలకు రక్షణను ఇవ్వాలనే గొప్ప ఉద్దేశంతో ఈ సంస్థ            ఏర్పాటైంది.