calender_icon.png 28 October, 2024 | 7:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నోబెల్ బెస్ట్ టు ఐడెంటి ఫ్లాష్ కార్డు అవార్డు సాధించిన నాలుగు నెలల పాప

07-07-2024 06:40:21 PM

 సిరికొండ : కొందరు చిన్నారు నెలల వయసులోనే అద్బుతమైన గ్రాస్పింగ్ పవర్ ప్రదర్శిస్తారు. ఏదైనా ఒక్కసారి చెబితే ఇట్టే గ్రహించడమే కాకుండా దానిని మర్చిపోకుండా గుర్తు పెట్టుకోవడం.. గుర్తించడం కూడా చేస్తుంటారు. ఇటీవల ఇలాంటి చిన్నారులు చాలామంది గురించి నెట్టింట చూశాం. వారికి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌, లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ లాంటి వారు గుర్తించి సత్కరించారు కూడా. తాజాగా జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ గ్రామానికి చెందిన మారిసేటి మహేందర్, మౌనిక దంపతుల కుమార్తె ఐరా అనే నాలుగు నెలల పాప అరుదైన రికార్డు సాధించింది.

నాలుగు నెలల వయసులోనే ఫ్లాష్ కార్డులను గుర్తు పడుతుంది. అంటే ఆల్పాబెట్స్, వెజిటేబుల్స్, పక్షులు, జంతువులు, పండ్లు, ఫ్లాగ్స్ లాంటి 135 వరకు గర్తుపట్టేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నాలుగు నెలల వయసులో 135  ఫ్లాష్ కార్డులను గుర్తు పట్టి చెపుతుండటంతో నోబల్ అవార్డు కోసం తల్లిదండ్రులు దరఖాస్తు చేశారు. దీంతో ఆ పాపకు సంబంధించిన వీడియోలను పరిశీలించిన నోబెల్ సంస్థ అవార్డు కేటాయించారని తల్లిదండ్రులు చెప్పారు. అతిపిన్న వయసు గల చిన్నారిగా నోబల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో పేరు నమోదు చేసుకోవడంతో ఐరా తల్లిదండ్రులు ఆనందానికి అవధులు లేవు, పట్టలేని  సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐరాకు నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సర్టిఫికెట్ అందించారు. చిన్నారి వీడియోను చూసిన నెటిజన్లు సైతం చిన్నారికి ఆశీర్వదిస్తున్నారు.

https://youtu.be/X4HQEOKG01o?t=6