ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్త మనిషి నోవా లైల్స్ అని తేలిపోయింది. ఆ సంగతి తేల్చే ఒలింపిక్స్ 100 మీటర్ల పరుగు పూర్తయింది, భారత కాలమానం ప్రకారం 1.20 ఆదివారం జరిగిన పారిస్ ఒలింపిక్స్ లో అమెరికా అథ్లెట్ నోవా లైల్స్ 9.79(0.784) తో బంగారు పథకం, అత్యంత హోరాహోరీగా సాగిన ఫైనల్లో వెంట్రుక వాసి తేడాతో కిషేన్ థాంప్సన్ను వెనక్కి నెట్టి 9.79 (0.789) సెకన్లలో లక్షాన్ని చేరుకున్నాడు. కానీ ఫోటో ఫినిష్లో నోవా కాస్త ముందున్నట్లు తేలింది. దాంతో కిషేన్ సిల్వర్ మెడల్తోనే సరి పెట్టుకోవాల్సి వచ్చింది. కాగా 9.81 టైమింగ్ తో ఫ్రెడ్ కెర్లీ కాంస్య పతక విజేతగా నిలిచాడు.