calender_icon.png 4 February, 2025 | 5:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూపాయి గురించి ఆందోళన లేదు

04-02-2025 01:50:43 AM

న్యూఢిల్లీ: డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకూ క్షీణిస్తున్న వేళ ఆర్థికశాఖ కార్య దర్శి తుహిన్‌కాంత పాండే దీనిపై స్పందించారు. విలువ క్షీణించడంపై ఆందోళన చెందడం లేదని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనిగురించి చూసుకుంటోందని విలేకరులతో అన్నారు.

రూపాయి విలువ అనేది ఎవరూ నియంత్రించేది కాదని, దానికంటూ ఒక స్థిరమైన ధర అం టూ ఉండదన్నారు. విదేశీ మదుపర్ల నిధులు తరలుతుండడం కూడా రూపాయి విలువ క్షీణ తకు ఓ కారణమని పాండే అన్నారు. అంతర్జాతీ య పరిణామాల నేపథ్యంలో రూ పాయి విలువ అంతకంతకూ క్షీణిస్తోంది. ముఖ్యంగా కెనడా, మెక్సికో, చైనాలపై ట్రంప్ సుంకాలు విధిస్తూ తీసుకున్న నిర్ణయంతో రూపాయి విలువ తాజాగా ఒక దశలో  మరో 67 పైసలు క్షీణించి 87.29 వద్ద జీవనకాల కనిష్టానికి చేరింది.