calender_icon.png 17 January, 2025 | 11:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

"వర్క్ ఫ్రమ్ జైల్" నుంచి 'కేజ్రీ' కి విముక్తి ?

12-09-2024 03:06:06 PM

న్యూ ఢిల్లీ: అందరూ  వర్క్ ఫ్రమ్ హోమ్.. వర్క్ ఫ్రమ్ ఆఫీస్.. అంటే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రవాల్ మాత్రం వర్క్ ఫ్రమ్ జైల్ అంటున్నారు. ఈ పరిస్థితిలో ఏమైనా మార్పు కోసం  కేజ్రీవాల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి  కేజ్రీ వాల్ బెయిల్ పిటిషన్ పై సుప్రీం కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించనుంది. ఈ సందర్భంగా  అభిషేక్ మను సింఘ్వీ వాదిస్తూ .. సీబీఐ తీరు పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మద్యం విధానంపై  కేసు నమోదు చేసిన తర్వాత రెండేళ్ల వరకు సీఎంను అరెస్టు చేయలేదు. ఎప్పుడైతే ఈడీ కేసులో బెయిల్.. వచ్చిందో వెంటనే సీబీఐ ఇన్స్యూరెన్స్ అరెస్టుకు పాల్పడింది. అరెస్టుకు ముందు ఎలాంటి నోటీసులు కూడా పంపించలేదు అని కోర్టుకు వివరించారు. మరోవైపు కేజ్రీవాల్ అబ్యర్థన ను సీబీఐ వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలో ఇరు పక్షాల వాదన విన్న సుప్రీం ధర్మాసనం  తీర్పును రిజర్వ్ చేసింది.