calender_icon.png 20 November, 2024 | 6:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పని లేదు కానీ నెలనెల జీతాలు

20-11-2024 04:46:26 PM

15 నెలలైనా జాబ్ చార్ట్ ఊసే లేదు..

హుజూర్ నగర్ (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్, కోదాడ రెవిన్యూ డివిజన్లలో జాబ్ చార్ట్ ఇవ్వకుండానే నెల నెలా జీతాలు మాత్రం ఇస్తున్నారు. వీఆర్ఏలుగా పనిచేసిన వారికి గత బీఆర్ఎస్ ప్రభుత్వము 2023 ఆగస్టులో పర్మినెంట్ చేసి రికార్డు అసిస్టెంట్లు గాను జూనియర్ అసిస్టెంట్లు గాను ప్రమోషన్లు కల్పించి 15 నెలలైనా జాబ్ చార్ట్ ఊసే అధికారుల నిర్లక్ష్యానికి  ఆశ్చర్యమేస్తుంది. 15 నెలలుగా రోజూ ఆఫీసుకు వచ్చి పోవడమే తప్పా నేటి వరకు వారికి సెక్షన్లు కేటాయించి వారి చేత పని చేయించుకున్న దాఖలాలు లేదంటే రెవిన్యూ అధికారుల పనితీరు ఏ విధంగా ఉందో అర్థమవుతుంది.

ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, నలుగురు రికార్డ్ అసిస్టెంట్లకు నేటి వరకు సెక్షన్లు అప్పజెప్పకుండా ఖాళీగా కూర్చోబెట్టడం ఒక విడ్డూరం. తహసిల్దార్ కార్యాలయంలో  ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు, ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక ఆర్ఐ లతోనే కార్యాలయంలోని అన్ని పనులు చేయిస్తుంటే ఉద్యోగాలు పొంది 15 నెలలుగా జీతాలు పొందుతూ రిజిస్టర్లలో సంతకాలు చేస్తూ కాగితాలపై కలం పెట్టనియకుండా వారిని ఎందుకు తహసిల్దార్ కార్యాలయంలో ఖాళీగా కూర్చోబెట్టారో అంతు బట్టని భేతాళ ప్రశ్నగా మారింది. ఇదే విధంగా  నియోజకవర్గంలోని పాలకీడు నేరేడుచర్ల మండలాల లోనూ కోదాడ నియోజకవర్గం లోని చిలుకూరు మండలంలోనూ కొనసాగుతున్నా  డివిజన్ స్థాయి అధికారులకు తెలియకపోవడం శోషనీయం.