ఉరేసుకొని మహిళ ఆత్మహత్య
కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆగస్టు 26 (విజయక్రాంతి): ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ మహిళ ఆత్మహ త్య చేసుకున్న ఘటన ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ పోలీస్ స్టేషన్ పరిధి లో చోటు చేసుకుంది. ఎస్‌ఐ సాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండ ల కేంద్రంలోని పల్లపు లక్ష్మి(41)కి ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. 2020లో కూతురు పెళ్లి చేయగా అప్పులయ్యాయి. చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియక ని త్యం మదనపడేది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి ఇంట్లో దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం తెల్లవారుజా మున కుటుంబ సభ్యులు గమని ంచి పోలీసులకు సమాచారం అంది ంచారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీ సులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.