22-03-2025 01:58:18 AM
రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 21 (విజయక్రాంతి): గ్రామీణ రోడ్లు, స్టేట్ రోడ్లకు టోల్ వసూలు చేసే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే హరీశ్‌రావు హ్యామ్ రోడ్లకు టోల్ వసూలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని పేర్కొనగా అందుకు కోమటిరెడ్డి సమాధానమిచ్చారు. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన 40శాతం కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు.
వారికి 3 లేదా 6 నెలల్లో చెల్లిస్తామని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో సింగరేణి నిధులను తీసుకొచ్చి గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటకు మాత్రమే రోడ్లు వేసుకున్నారని విమర్శించారు. హరీశ్‌రావు పేర్కొన్నట్లు వారి హయాంలో రాష్ట్రంలోని అన్ని మండలాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్లు అనేది అబద్ధమని తెలిపారు. చాలెంజ్ చేస్తున్నా.. రాష్ట్రమంతా తిరిగి చూద్దామా అంటూ హరీశ్‌రావుకు సవాల్ విసిరారు.