calender_icon.png 22 October, 2024 | 7:10 AM

యాదాద్రిలో వీడియోలకు నో

22-10-2024 03:29:35 AM

యాదాద్రిభువనగిరి, అక్టోబర్ 21 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరి కొండపై వీడియోలు, ఫొటో షూట్స్‌పై ఆలయ అధికారవర్గం ఆంక్షలు విధించింది. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(బీఆర్‌ఎస్) ఈనెల 14న కుటుంబ సమేతంగా వచ్చి ఆలయ ప్రాంగణాల్లో వీడియో షూట్(రీల్స్) చేసి సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేయడం తీవ్ర వివాదంగా మారింది.

ఈ నేపథ్యంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఏ.భాస్కర్‌రావు సోమ వారం ఒక ప్రకటన విడుదల చేశారు. యాదగిరి కొండపై కొంతమంది తమ వ్యక్తిగత ప్రతిష్ట, ప్రయోజనాల కోసం వీడియోలు, ఫొటోలు తీసి దేవస్థానం ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు.

ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా యాదాద్రి కొండపై వీడియోలు, ఫొటో షూట్స్‌పై ఆంక్షలు విధించినట్లు తెలిపారు. భక్తులు ఆలయ ప్రాశస్త్యం గుర్తించి ఇటువంటి చర్యలకు పాల్పడవద్దని కోరారు.