calender_icon.png 24 February, 2025 | 4:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విచారణకు సమయం లేదు

19-02-2025 11:24:32 PM

సీఈసీ, ఈసీల నియామకంపై విచారణను వాయిదా వేసిన సుప్రీంకోర్టు..

న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ), ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. సమయాభావం వల్ల విచారణను వాయిదా వేస్తున్నట్టు బుధవారం పేర్కొంది. అయితే పిటిషన్లపై మార్చి 19న విచారణ జరుపుతామని జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం హామీ ఇచ్చింది.

సీఈసీ, ఎన్నికల కమిషనర్లను నియమించే కమిటీలో ప్రధానమంత్రి, ప్రతిపక్షనేత, భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) ఉండాల్సి ఉండగా.. కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చి సీజేఐ స్థానంలో కేంద్ర మంత్రికి స్థానం కల్పించింది. దీన్ని వ్యతిరేకిస్తూ కొందరు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పిటిషన్లపై విచారణ సుప్రీం కోర్టు పరిధిలో ఉండగానే కేంద్ర ప్రభుత్వం సోమవారం రోజు కొత్త సీఈసీని, ఎన్నికల కమిషనర్‌ను నియమించింది. ఈ నియామకాన్ని కూడా పిటిషనర్లు తాజాగా వ్యతిరేకించారు.