10-04-2025 02:26:06 AM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),ఏప్రిల్ 9: మండల కేంద్రం అర్వపల్లిలోని జెడ్పిహెచ్‌ఎస్ లో విద్యార్థుల పుట్టినరోజు సందర్భంగా ఉపాధ్యాయులు వినూత్న రీతికి శ్రీకారం చుట్టారు.పాఠశాలలో చదివే విద్యార్థుల పుట్టినరోజు సందర్భంగా స్వీట్లు వద్దు...మొక్కలే ముద్దు అంటూ పర్యావరణానికి మేలు చేస్తున్నారు.
బుధవారం పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థిని గౌతమి పుట్టినరోజు సందర్భంగా మొక్కను నాటి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి,పీఈటీల సంఘం జిల్లా అధ్యక్షుడు,పీడీ మల్లేష్,ఉపాధ్యాయులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.