calender_icon.png 3 December, 2024 | 10:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుర్రంపోడు ఎస్సైపై సస్పెన్షన్ వేటు

15-10-2024 12:24:03 AM

హత్య కేసులో నిందితులను తప్పించేందుకు యత్నం 

నల్లగొండ, అక్టోబర్ 14 (విజయక్రాంతి): నల్లగొండ జిల్లా గుర్రంపోడు ఎస్సై వీ నారాయణరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఓ హ త్య కేసు దర్యాప్తును ఎస్సై నీరుగార్చారని, కే సులో ప్రమేయమున్న ఇద్దరు నిందితులతో కుమ్మక్కై కానిస్టేబుల్ ద్వారా రూ.లక్ష లంచం తీసుకున్నట్లు అతడిపై అభియోగాలున్నా యి.

విచారణ జరిపిన ఎస్పీ శరత్‌చంద్ర ప వార్ దర్యాప్తు నివేదికను మల్టీజోన్  ఐజీ సత్యనారాయణకు అందించారు. నివేదిక ఆ ధారంగా పోలీస్ ప్రతిష్టను దిగజార్చేలా వ్య వహరించిన నారాయణరెడ్డిని సస్పెండ్ చేస్తున్నట్లు ఐజీ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.