- దొంగ బంగారం తక్కువ ధరకు ఇస్తానని రూ.20 లక్షలు కాజేత
- విచారణ అనంతరం చర్యలు తీసుకున్న అధికారులు
కామారెడ్డి, అక్టోబర్ 22 (విజయక్రాంతి): కామారెడ్డిలోని జిల్లా పోలీస్ కార్యాలయం లో డీసీబీఆర్‌లో డీఎస్పీగా పనిచేసిన మదన్‌లాల్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఇటీవల దొంగల ముఠా పట్టుబడిందని, వారివద్ద కిలోకు పైగా బంగారం దొరికిందని, వాటిని తక్కువ ధరకు ఇచ్చేస్తానని నమ్మబలికి ఓ వ్యక్తి నుంచి రూ.20 లక్షలు తీసుకొని ఆ వ్యక్తికి బంగారాన్ని ఇవ్వలేదు. దీంతో ఆ వ్యక్తి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణలో వాస్తమేనని తేలడంతో మదన్‌లాల్‌ను సస్పెండ్ చేస్తూ మంగళవారం డీజీపీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ చేశారు.