calender_icon.png 24 February, 2025 | 3:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెట్రోల్ బంకులో నో స్టాక్..

24-02-2025 12:30:06 AM

వినియోగదారుల ఇక్కట్లు 

ఖానాపూర్, ఫిబ్రవరి 23,(విజయ క్రాంతి) నిర్మల్ జిల్లా, ఖానాపూర్ మండల కేంద్రంలో, పెట్రోల్ బంకుల్లో నోస్టాక్ బోర్డు తగిలించడంతో, వినియోగదారులు ఇబ్బందులు పడుతు న్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా, పెట్రోల్ బంకులు నిరంతరం స్టాక్ ఉంచాల్సిన తరుణంలో, యాజమాన్యం నిర్లక్ష్యంతో, వినియోగదారులు ఇక్కట్ల పాలు అవుతున్నారన్న ఆరోపణలు వున్నాయి.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ పెట్రోల్ బంకు, పట్టణం ప్రధాన రహదారి పై ఉండాల్సి ఉండగా, దాని లొకేషన్ మార్చి తర్లపాడు రోడ్డుపై పెట్టినప్పటంతో పట్టణ వినియోగదారులకు కొంతమేర ఇబ్బంది కలుగుతున్నప్పటికీ, నో స్టాక్ బోర్డుతో మరింత సమస్యగా మారిందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.

ప్రజల సంక్షే మార్థం  పెట్రోల్ బంకులో పర్యవేక్షించాల్సిన, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, స్థానిక రెవెన్యూ అధికా రులు, పట్టించుకోక నిర్లక్ష్యం వహించడంతో, యాజమాన్యం స్టాక్ అయిపోయిన ,సమయా నుకూలంగా పెట్రోల్ ,డీజిల్ ,అందుబాటులోకి తీసుకు రాకపోవడం, శోచనీయమని పలువురు వినియోగదారులు అంటున్నారు.  ఇకనైనా స్థానిక రెవెన్యూ అధికారులు పెట్రోల్ బంకులపై పర్యవేక్షణ ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

పెట్రోల్ డీజిల్ అందుబాటులో ఉంచాలి.. అధికారుల పర్యవేక్షణ ఉండాలి

ఖానాపూర్ దినదినం అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, రవాణా వ్యవస్థ పెరిగిపోయింది. పెట్రోల్ ,డీజిల్ ,ఎప్పుడు అందుబాటులో ఉంచాలి. ఎన్ఫోర్స్మెంట్ అధికారుల పర్యవేక్షణ నిరంతరం ఉండాలి. బంకులలో కనీస వసతులు కచ్చితంగా ఉండాలి.

 సునారికారి రాజేష్ , సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఖానాపూర్ డివిజన్ అధ్యక్షులు