calender_icon.png 3 April, 2025 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిబ్బంది లేక ఇబ్బంది

25-03-2025 12:46:23 AM

మోతే మండలంలో కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలకు అవస్థలు

మోతే,మార్చి24:సూర్యాపేట జిల్లా మోతే తహసిల్దార్ కార్యాలయంలో సిబ్బంది లేక  ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  కార్యాలయ పనుల కోసం వెలితే రోజుల తరబడి పనులు కావడం లేదంటున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన రాజీవ్ వికాస్ పథకం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ పథకం  కోసం దరఖాస్తులు చేసుకోవడానికి  కుల. ఆదాయ దృవపత్రాలు అవసరం కావడంతో మీసేవ కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకుంటున్నారు. కానీ సకాలంలో  దృవపత్రాలు అందడం లేదు

ఇంచార్జ్  తహసీల్దార్ విచారణ

మోతే మండల తహసీల్దార్ కార్యాలయంలో  రికార్డుల టాంపరింగ్ జరిగిందని గుర్తించిన కలెక్టర్ అక్కడి తహశీల్దార్తో పాటు ఇద్దరు ఆర్‌ఐలను సస్పెండ్ చేశారు. ఆర్డివో కార్యాలయంలో ఐవోగా విధులు నిర్వహిస్తున్న శ్రీకాంత్కు ఇంచార్జ్ భాద్యతలు ఇచ్చారు. ఇతర అధికారులను కేటాయించలేదు.

దీంతో కుల, ఆదాయ ధ్రువీకరణ కోసం అందిని దరఖాస్తులను ఇంచార్జ్ తహసీల్దార్ శ్రీకాంత్ స్వయంగా గ్రామాల్లోకి వెళ్లి విచారణ చేయవలసిన పరిస్థితి నెలకొన్నది.  దీంతో సమయం ఎక్కువగా పడుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే కొత్త ఆర్ ఐ ను నియమించి ప్రజల సమస్యలను పరిష్కారం చేయాలని మండలప్రజలు కోరుకుంటున్నారు.