18-04-2025 12:23:53 AM
హైదరాబాద్, ఏప్రిల్ 17 (విజయక్రాంతి) : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ)లో పనిచేస్తున్న సిబ్బందికి సకాలంలో వేతనాలు అందడం లేదు. మూడు నెలలుగా వేతనాలు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వచ్చే కొద్దిపాటి వేతనం ప్రతినెలా అందకపోవడంతో ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబా లు పస్తులతో కాలం వెల్లదీస్తున్నాయి.
రాష్ర్టంలోని ఉద్యోగులు అందరికీ ప్రతినెల ఒకటో తేదీనే వేతనాలు ఇస్తున్నా మని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ కింద రాష్ర్టంలో అదనపు ప్రాజెక్టు అధికారులు (ఏపీవో) 400 మంది, టెక్నికల్ అసిస్టెం ట్లు (టీఏ) 2,150 మంది, కంప్యూటర్, అకౌంట్స్ ఆపరేటర్లు (సీవో) 850 మంది, ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్స్? (346) మంది, ఫీల్డ్ అసిస్టెంట్లు (ఎఫ్‌ఏ) 7,471 మంది పనిచేస్తున్నారు.
ఉపాధి సిబ్బంది అంతా కలిపి సుమారు 12,300 మంది ఉంటారు. వీరంతా ఉపాధి హామీ కూలీలతో పనులు చేయించడం, వారికి సకాలంలో వేతనాలు అందించడం.. వంటి విధుల్లో పాలుపంచుకుంటారు. ఉపాధి హామీ పనులను క్రమం తప్పకుండా చేయిస్తూ కేంద్రం నుంచి వీలైనంత మేర నిధులు రప్పించడంతో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
మెటీరియల్ కాంపోనెంట్ నిధుల కింద 2,150 మంది టీఏలకు నెలనెలా వేతనాలు అందుతుండగా.. మిగతా వారికి ఫిబ్రవరి నుంచి, ఫీల్డ్ అసిస్టెంట్లకు జనవరి నుంచి వేతనాలు అందడం లేదు. మూడు నెలల నుంచి వేతనాలు అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సిబ్బంది వాపోతున్నారు.
వారిదే కీలక బాధ్యత..
ఉపాధి కూలీలకు ఎంత ఎక్కువగా పనులు కల్పిస్తే అంత భారీ మొత్తంలో నిధులు విడుదలవుతాయి. కూలీలకు ఎక్కువ పని దినాలు కల్పించే బాధ్యతలో కీలక భాగస్వాములు ఫీల్డ్ అసిస్టెంట్లు. వారికి నెలకు రూ.10 వేల వేతనం మాత్రమే. ఆ కొద్ది మొత్తం కూడా ప్రతినెలా రాకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొం టున్నట్టు ఫీల్డ్ అసిస్టెంట్లు వాపోతున్నారు.
ఉపాధి పనుల్లో హరితహారం, డంపింగ్ యార్డులు, నీటినిల్వ పనులు, పండ్ల తోటల పెంపకం, నర్సరీల నిర్వహణ, చెరువుల్లో పూడికతీత వంటి పనులను పర్యవేక్షిస్తుంటారు. ఇంత చేస్తున్నా సకాలంలో వేతనాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పే స్కేల్ ఎప్పుడు..?
ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న అదనపు ప్రాజెక్టు అధికారులు (ఏపీవో) దినదిన గండంగా కాలం వెల్లబుచ్చుతున్నారు. 2006 నుంచి అంటే 19 ఏండ్లుగా కాంట్రాక్టు ఉద్యోగులుగానే పనిచేస్తున్నారు. తమకు టార్గెట్లు విధించి పనిభారం పెంచుతున్న ప్రభుత్వం..
పే స్కేల్ అమలుచే యడం లో నిర్లక్ష్యం వహిస్తున్నదని ఏపీవోలు ఆరోపిస్తున్నారు. 2024 ఫిబ్రవరి 2న రాష్ర్ట పం చాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న ఏపీవోలకు పే స్కేల్ అమలుచేస్తామని హామీ ఇచ్చారని, ఏడాది దాటినా దాన్ని అమలు చేయడంలేదన్నారు.