calender_icon.png 4 February, 2025 | 2:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమ్మెపై వెనక్కి తగ్గం

04-02-2025 12:38:14 AM

  1. సమ్మెకు దిగనీయకుండా యాజమాన్యం బెదిరింపులు
  2. కార్మికులను కూడగడతాం
  3. ఆర్టీసీ జేఏసీ నేతలు

హైదరాబాద్, ఫిబ్రవరి3 (విజయక్రాంతి): ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగనీయకుండా యాజమాన్యం బెదిరింపులకు పాల్పడుతున్నది. అయినా మేం వెనక్కి తగ్గం. కార్మికులను కూడగడతాం. న్యాయపరంగా మాకు రావాల్సిన హక్కులను సాధించుకుని తీరుతాం’ అని జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్‌రెడ్డి తేల్చిచెప్పారు.

హైదరాబాద్‌లోని ఎంప్లా యిస్ యూనియన్ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం జేఏసీ నేతలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఫిబ్రవరి 9న లేదా ఆ తర్వాత చేపట్టనున్న కార్మికుల సమ్మెను నిర్వీర్యం చేసేందుకు యాజమాన్యం కుట్రలు పన్నుతున్నదని ఆరోపించా రు. సమ్మెలో పాల్గొనకుండా కార్మికులను బెదిరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వం ట్రేడ్ యూనియన్లను రద్దు చేసి కార్మికుల హక్కుల ను కాలరాసిందని, అదే తీరుగా ఇప్పటి కాంగ్రెస్‌ప్రభుత్వం కూడా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ఇప్పటికైనా యాజమాన్యం కార్మికులపై వేధింపులు మానుకోవాలని, లేదంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.