calender_icon.png 20 April, 2025 | 1:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు వెడల్పు లో అంబేద్కర్ విగ్రహం తొలగింపు ఉండదు

05-04-2025 04:39:12 PM

పెద్దపల్లి,(విజయక్రాంతి): గోదావరిఖని లో రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ విగ్రహం తొలగింపు ఉండదని స్థానిక సంస్థల అదనప కలెక్టర్, రామగుండం ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్ జే.అరుణ శ్రీ  శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గోదావరిఖని బస్టాండ్ చౌరస్తాలో రోడ్డు వెడల్పులో అంబేద్కర్ విగ్రహం తొలగిస్తారని కొందరు అపోహలు సృష్టిస్తున్నారని, ప్రజలు ఎవరు ఇటువంటి అపోహలను నమ్మ వద్దని, రోడ్డు వెడల్పులో విగ్రహాల తొలగింపు ఎట్టి పరిస్థితుల్లో ఉండదని, ప్రజలు అనవసర  ఆందోళనకు గురి కావద్దని అదనపు కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.