- ప్రజల ఆరోగ్యమే ఇక్కడ ప్రాధాన్యం
- ఢిల్లీలో ఏడాదంతా పటాకులను నిషేధించాలి:
న్యూఢిల్లీ, నవంబర్ 11: ఏ మతమూ కాలుష్యాన్ని ప్రోత్సహించదని, పటాకుల నిషేధంపై ఢిల్లీ పోలీసులు సీరియస్‌గా లేరని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ఢిల్లీలో దీపావళి వేళ పటాకులు కాల్చడంపై నిషేధం ఉన్నప్పటికీ ప్రజలు పెద్ద ఎత్తున కాల్చారని, దీనివల్ల నగరంలో పెద్దఎత్తున వాయు కాలుష్యం ఏర్పడిందని సుప్రీం ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ అగస్టీస్ జార్జ్‌తో కూడిన ద్విస భ్య ధర్మాసనం సోమవారం మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది.
‘ఆరోగ్యంగా జీవించటం పౌరులకు ప్రాథమిక హక్కు. తీవ్ర కాలుష్యం దృష్ట్యా ఢిల్లీలో ఏడాదంతా పటాకులను నిషేధించాలి. ఇందుకు పోలీసులు తక్షణమే చర్య లు తీసుకోవాలి’ అని కోర్టు స్పష్టం చేసింది. పటాకుల నిషేధంపై ఢిల్లీ పోలీస్ కమిషనర్ ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయడంతో పాటు నిషేధాన్ని ఉల్లంఘించే దుకాణాలను సీజ్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది.
రా మెటీరియల్‌ను మాత్రమే సీజ్ చేసి చేతులు దులుపుకోకుండా నవంబర్ 25లోగా వ్యాపారులతో చర్చించి శాశ్వతంగా పరిష్కా రం చూపాలని స్పష్టం చేసింది. రానున్న దీపావళి వరకైనా ఇలాంటి పరిస్థితి ఉత్ప న్నం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.