13-03-2025 01:19:20 AM
బహిరంగ లేఖ విడుదల చేసిన సౌందర్య భర్త రఘు
హైదరాబాద్, మార్చి 12: సినీ నటుడు మోహన్‌బాబు, దివంగత నటి సౌందర్య మధ్య ఆస్తి తగాదాలు వచ్చాయంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోహన్‌బాబుతో తమకు ఎలాంటి గొడవలు లేవంటూ సౌందర్య భర్త రఘు బహిరంగ లేఖను విడుదల చేశారు. ఆస్తి కోసం సౌందర్యను ప్లాన్ చేసి చంపారని వస్తు న్న వార్తలన్నీ అవాస్తవమన్నారు.
మోహన్‌బాబుతో తమ కుటుంబానికి 25 ఏళ్లుగా మంచి అనుబంధముందని రఘు లేఖలో పేర్కొన్నారు. ‘హైదరాబాద్‌లోని సౌందర్య ఆస్తికి సం బంధించి కొన్ని రోజులుగా తప్పుడు ప్రచారం జరుగుతోంది. సౌందర్య ఆస్తిని మోహన్‌బాబు ఆక్రమించుకున్నట్లు వస్తున్న వార్తలను పూర్తిగా ఖండిస్తున్నా.
ఆయనతో సౌందర్య ఎలాంటి భూ లావాదేవీలు జరపలేదు. మోహన్‌బాబు కుటుంబంతో సౌందర్య కుటుంబానికి మంచి అనుబంధముంది. ఆయన్ను నేను గౌరవిస్తా. మేమంతా ఒకే కుటుంబంగా ఉంటాం. మోహన్‌బాబుతో మాకు ఎలాంటి ఆస్తి గొడవలు లేవు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి’ అని రఘు లేఖలో వెల్లడించారు.