calender_icon.png 22 March, 2025 | 7:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదన లేదు

22-03-2025 02:13:13 AM

  1. టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారుఖీ
  2. ఈఆర్‌సీ చైర్మన్ జస్టిస్ డాక్టర్ నాగార్జున ఆధ్వర్యంలో బహిరంగ విచారణ

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 21 (విజయక్రాంతి): ఈ ఏడాది విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదన లేదని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫారుఖీ తెలిపారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆ ర్‌సీ) చైర్మన్ జస్టిస్ డాక్టర్ నాగార్జున అధ్యక్షతన కల్యాణ్ నగర్, జేటీఎస్ కాలనీలోని విద్యుత్ నియంత్రణ భవన్‌లో బహిరంగ విచారణ నిర్వహించారు.

2025-26 ఆర్థిక సంవత్సరానికి సవరణ చేసిన ఆదాయ ఆవశ్యకత, రిటైల్ సరఫరా ధరలు, క్రాస్ సబ్సీడీ సర్‌చార్జీల ప్రతిపాదనలపై నిర్వహించిన ఈ బహిరంగ విచారణలో జేఎండీ సీ శ్రీనివాసరావు, వేణుగోపాలరావు టీజీ డిస్కం అధికారులు, రైతులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ ఆర్‌సీ చైర్మన్ జస్టిస్ డాక్టర్ నాగార్జున అక్కడికి వచ్చిన వారి నుంచి ఫిర్యాదులు స్వీకరిం చారు.

ఈ సందర్భంగా టీజీఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషా  ఫారుఖీ మాట్లాడుతూ ఈ ఏడాది రెవె న్యూ గ్యాప్ రూ.9,758 కోట్లు ఉందని, ఈ గ్యాప్‌ను ప్రభుత్వమే సబ్సీడీ ద్వారా భర్తీ చేయాలని ప్రతిపాదించిందన్నారు.  టీజీఎస్పీడీసీఎల్‌లో గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రస్తుత సీఎండీ ముషారఫ్ ఫిర్యాదు అందిన వారంలోనే తమ సమస్యలను పరిష్కరిస్తున్నారని పలువురు రైతులు కమిషన్ దృష్టికి తీసుకొచ్చారు. 

ఏ క్యాటగిరీ వినియోగదారుల టారీఫ్‌లో పెంపులేదు

ఏ క్యాటగిరీకి చెందిన వినియోగదారుల టారీఫ్‌లో ఎలాంటి పెరుగుదల ఉండబోదని రాష్ట్ర ఇందన శాఖ డిప్యూటీ సెక్రటరీ ఎస్ ప్రియదర్శిని తెలిపారు. ప్రభుత్వం తరఫున బహిరంగ విచారణలో పాల్గొని కమిషన్ ఆమోదించే టారీఫ్ ఉత్తర్వును అనుసరించి 2025-26 ఏడాదికి విద్యుత్ చట్టంలోని 65వ నిబంధన ప్రకారం తెలంగాణ విద్యుత్ సంస్థలకు అవసరమైన ఆర్థిక మద్దతును సమకూర్చడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.