బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా జంటగా రూపొందిన చిత్రం ‘చావా’. ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. పిరియాడిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలను గట్టిగానే నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో రష్మిక పాల్గొని తన రిటైర్మెంట్ గురించి సరదాగా మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. “ఈ చిత్రంలో శంభాజీ భార్య ఏసుబాయి గా నటించే అవకాశం రావడం నాకు దక్కిన గౌరవం.
ఇంతకు మించి ఒక నటిగా నాకు ఏం కావాలి? ఈ సినిమా తర్వాత నేను రిటైర్ అయినా ఇబ్బంది లేదని దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్‌తో చెప్పాను. అంత గొప్ప పాత్ర ఇది. దీని షూటింగ్ సమయంలోనూ.. ట్రైలర్ చూశాక ఎంతో భావోద్వేగానికి గురయ్యా. విక్కీ కౌశల్ అయితే దేవుడిలా కనిపిస్తున్నాడు. ఈ సినిమా కోసం డైరెక్టర్ నన్ను సంప్రదించినప్పుడు ఆశ్చర్యమేసింది. క్షణం కూడా ఆలోచించకుండా ఓకే చెప్పేశా” అని రష్మిక చెప్పుకొచ్చింది.