calender_icon.png 22 January, 2025 | 9:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిగ్నల్ లేకున్నా నో ప్రాబ్లం

21-01-2025 12:47:09 AM

* ఏ నెట్‌వర్క్‌తోనైనా ఫోన్ చేయొచ్చు

ముంబై: రిలయన్స్ జియో, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్), భారతీ ఎయిర్‌టెల్ యూజర్లకు గుడ్ న్యూస్. యూజర్లు తాము వాడుతున్న సిమ్ కార్డ్ సిగ్నల్ కోల్పోయినా అందుబాటులో ఉన్న ఇతర నెట్‌వర్క్  సాయంతో కాల్ చేసుకునే వెసులుబాటు వచ్చింది. ఈ నెల 17న కేంద్ర ప్రభుత్వం ఇంట్రాసర్కిల్ రోమింగ్ (ఐసీఆర్) ఫెసిలిటీ తీసుకొచ్చింది.

డిజిటల్ భారత్ నిధి (డీబీఎన్) ద్వారా ఏర్పాటైన 4జీ టవర్ల పరిధిలో ఐసీఆర్ ఫెసిలిటీ అందుబాటులో ఉం టుంది. సింగిల్ డీబీఎన్ ఫండెడ్ టవర్ ద్వారా ఏ నెట్‌వర్క్‌కు చెందిన యూజర్లైనా ఇతర  నెట్‌వర్క్ కాల్ చేసుకోవచ్చు.ఒకే టవర్ పరిధిలో 4జీ సేవలు వినియోగించుకుంటున్న యూజర్లు ప్రభుత్వ నిధులతో ఏర్పాటైన మొబైల్ టవర్ మౌలిక వసతుల ను టెలికం సర్వీస్ ప్రొవైడర్లకు అందుబాటులోకి తెచ్చారు.

దీనివల్ల యూజర్లు అధిక ఖర్చు చేయకుండా మెరుగైన మొబైల్ సర్వీసులతో లబ్ధి పొందొచ్చు. దేశవ్యాప్తంగా 35,400 మారుమూల గ్రామాల పరిధిలో కేంద్ర ప్రభుత్వం సుమారు 27 వేల టవర్లను ఏర్పాటు చేసింది. కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.. తాజాగా ఇంట్రా సర్కిల్ రోమింగ్ కాల్ సేవలను ప్రారంభించారు. అయితే, ఈ సేవలు డీబీఎన్ టవర్లు ఉన్న ప్రాంతాల్లో మాత్రమే పొందొచ్చు.