calender_icon.png 27 December, 2024 | 11:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగ్రి వర్సిటీతో ఏ ప్రైవేట్ సంస్థకు భాగస్వామ్యం లేదు

05-11-2024 12:54:08 AM

పీజేటీఏయూ వీసీ ప్రొఫసర్ జానయ్య

హైదరాబాద్, నవంబర్ 4 (విజయక్రాంతి): 2022 జులై వరకు వ్యవ సాయ విశ్వవిద్యాలయంతో కొన్ని ప్రైవేట్ సంస్థలు చేసుకున్న అవగాహన ఒప్పందాలు వర్సిటీ ప్రయో జనాలకు భంగం కలిగించే విధంగా ఉన్నందున వాటిని రద్దు చేస్తున్నట్టు పీజేటీఏయూ వీసీ ప్రొఫెసర్ ఆల్థాస్ జానయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ప్రైవేట్ సంస్థలతో ఉన్న ఒప్పందాలను రద్దు చేశారు.

ప్రైవేట్ సంస్థలకు వ్యవసాయ విశ్వవిద్యాలయంతో ఎలాంటి సంబంధం లేదనే విషయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు, సామాన్య ప్రజలు గమనించాలని సూచించారు. పీజేటీఏయూలో వ్యవసాయ కోర్సుల నిర్వహణకు సంబంధించిన ఎలాంటి ప్రైవేట్ సంస్థలతో భాగస్వామ్యం లేదని స్పష్టం చేశారు.

కొన్ని ప్రైవేట్ సంస్థలు వర్సిటీ పేరును వాడుకుని వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా సీట్లు ఇప్పిస్తామని ప్రచారం జరుగుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, ఈ విషయాలను నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.