calender_icon.png 6 March, 2025 | 10:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేసవిలో విద్యుత్ అంతరాయం కలగద్దు...

06-03-2025 06:21:54 PM

ఏర్పడే డిమాండ్ ని దృష్టిలో ఉంచుకుని ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి..

విద్యుత్ అధికారులకు కలెక్టర్ రాహుల్ రాజ్ దిశా నిర్దేశం..

పాపన్నపేట: రానున్న వేసవిలో అవసరమయ్యే డిమాండ్ కు అణుగుణంగా ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులకు ఆదేశించారు. గురువారం కలెక్టర్ మండలం పరిధిలోని మిన్పూర్ 220/132 కెవి సబ్ స్టేషన్ ను విద్యుత్ శాఖ ఎస్.ఈ. శంకర్, సంబంధిత విద్యుత్ అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... మెదక్ జిల్లాలో ఎలాంటి ఓవర్ లోడ్ లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు చేపట్టాలని సూచించారు. లో వోల్టేజీ సమస్య లేకుండా గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. గ్రామాల్లో పర్యటించి వ్యవసాయ, గృహ విద్యుత్ సరఫరా గురించి రైతుల, గృహిణుల అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు.

విద్యుత్‌ శాఖ అధికారులు, సిబ్బంది విధుల్లో అలసత్వం వహించకూడదన్నారు. విద్యుత్‌ సంబంధించిన ఫిర్యాదులు వస్తే తక్షణమే పరిష్కరించాలన్నారు. పాపన్నపేట మండలం మిన్పూర్ 220/132 కె వి సబ్స్టేషన్ ద్వారా జిల్లాలో 33/11 కె వి, 18 సబ్ స్టేషన్లకు నిరంతరాయంగా సరఫరా చేయడం జరుగుతుందని అధికారులు కలెక్టర్ కి వివరించారు. ఈ సందర్బంగా సబ్ స్టేషన్ లోని విద్యుత్‌ బ్రేకర్లను, సరఫరా వ్యవస్థను పరిశీలించారు. సంబంధిత రికార్డులను, విద్యుత్‌ యూనిట్ల వాడకాన్ని చూశారు. జిల్లాలో ఎక్కడ విద్యుత్ అంతరాయం ఏర్పడినా వెంటనే 1912 కు టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయాలనీ ఈ సందర్బంగా కలెక్టర్ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ డీఈ బాషా, సబ్ డివిజనల్ ఏ.ఈ శ్రీనివాస్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.