calender_icon.png 8 January, 2025 | 9:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేసవిలో విద్యుత్ కోతలు ఉండొద్దు

08-01-2025 12:20:33 AM

విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా 

హైదరాబాద్, జనవరి 7 (విజయక్రాంతి): రాబో యే వేసవిలో పంటలకు, గృహావసరాలకు విద్యుత్ కొరత, సరఫరాలో అంతరాయం తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా అధికారులను ఆదేశించారు. ట్రాన్స్‌కో, డిస్కంలపై ఆయన మంగళవారం హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించారు.

వేసవిలో డిమాండ్‌కు సరిపడా విద్యుత్‌ను అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రబీలో ప్రస్తుత విద్యుత్ సరఫారాపై ఆయన సంతృప్తి వ్యక్తం చేయడంతోపాటు, నాణ్యమైన విద్యుత్‌ను అంద చేసేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవాలన్నారు. సబ్‌స్టేషన్ పనులు వేసవి ప్రారంభా నికి ముందే పూర్తి చేయనున్నట్లు తెలిపారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలో విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక కార్యాచరణను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సమావేశంలో అధికారులు డీ కృష్ణభాస్కర్, ముషారఫ్ అలీ ఫరూకీ, కే వరుణ్‌రెడ్డి, సీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.