25-03-2025 01:03:23 AM
హత్నూర, మర్చి 24: హత్నూర మండలపరిధిలోని బోరపట్ల ఎపిటోరియం పరిశ్ర మల కార్మికులపై రాజకీయం వద్దని మాజీ ఉప సర్పంచ్,కాంగ్రెస్ జిల్లా నాయకులు కాసాల విట్టల్ అన్నారు. సోమవారం సంగారెడ్డి జిల్లా కార్యాలయం ప్రజావాణిలో వినతి పత్రాలు అందజేసి మాట్లాడారు.
బోర్పట్ల గ్రామ పంచాయతీ శివారి ఎపిటోరియా (అరబిందో) యూనిట్ వన్ పరిశ్రమలో గ్రామస్తులతోపాటు చుట్టుపక్కల గ్రామస్తులు పనులు చేసుకుంటూ జీవనోపాధి పొందుతుందన్నారు. అలాంటి కార్మికులపై కొందరు వ్యక్తులు రాజకీయ సోలాభం కోసం కార్మికుల పోట కొట్టకూడదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమ యాజమాన్యం కబ్జాలు అక్రమ కట్టడాలు నిర్మాణాలు చేపడితే గ్రామ పంచాయతీ తీర్మానాలు పరిశీ లించి చర్యలు తీసుకోవాలని తెలిపారు.
పరిశ్రమలో నష్టాలు లాభాలు ఉన్నాయని గ్రా మపంచాయతీకి పన్నులు చెల్లిస్తున్నారని అంతేకాకుండా సి ఎస్ ఆర్ ఫండ్స్ తో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని గుర్తు చేశారు. సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో పరిశీలించి గ్రామస్తులు అభిప్రాయం మేరకు చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేయడం జరిగిందని తెలిపారు.