calender_icon.png 18 January, 2025 | 4:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పథకాల అమలులో రాజకీయాలు వద్దు

18-01-2025 01:11:30 AM

* పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క 

*  నిర్మల్‌లో సమావేశం

నిర్మల్, జనవరి 17 (విజయక్రాంతి): పథకాల అమలులో రాజకీయాలు చూడ    ల  పథకాలు అం  చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం నిర్మల్ కలెక్టరేట్‌లో ఉ  ఆదిలాబాద్ జిల్లా అధికారు  ప్రజాప్రతినిధుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ రైతు భరోసా పథకాలతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అభివృదిధ పనులపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడతూ.. పథ  లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ పార్టీల ప్రమేయం ఉండకుండా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోవాలని సూచించారు. నిరుపేదలకు అన్యాయం జరిగితే అధికారులపై చర్యలు ఉంటాయని హె  అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా పనిచేయాలని కలెక్టర్లను ఆదే  ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉ  సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని భరోసా కల్పించారు. 

సమస్యలపై ఎమ్మెల్యేల గళం

నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి  మాట్లాడుతూ.. పథకాల ఎంపిక సర్వే నిష్పక్షపాతం గా నిర్వహించాలని కోరారు. పట్ట  విలీనం అయిన గ్రామాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా సాయం అందించాలన్నా రు. ఖానాపూర్ ఎమెల్యే వెడ్మ బొజ్జుపటేల్ మాట్లాడుతూ.. దళారులు ప్రజలను, అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఆదిలాబాద్ ఎమెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లో 1/70 యాక్టు అమలులో ఉన్నందున్న గిరిజన ప్రాంతంలోని గిరిజనేతరులకు ప్రభుత్వం పథకాలు అందడం లేదన్నారు. వారికి పథకాలు అందేలా చూడాలన్నారు. ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ మా ట్లాడుతూ.. తన నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలన్నారు.

బోథ్ ఎమ్మెల్యే అనిల్ మాట్లాడుతూ.. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులకు ఇండ్లు ఎక్కువగా కేటాయించాలని కోరారు.  సమావేశంలో కలెక్టర్లు అభిలాష అభినవ్, రాజర్షి షా, వెంకటేశ్ డోంగ్రే దీపక్, ఎమెల్సీ దండె విఠల్, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, డీసీసీబీ చైర్మన్ భోజరెడ్డి, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ తిరుపతి పాల్గొన్నారు.