25-04-2025 02:44:38 AM
ఎర్రవెల్లి గ్రామస్తులు హెచ్చరిక
చారకొండ, ఏప్రిల్ 24: గోకారం రిజర్వాయర్ లో మా భూములు, మా ఇండ్లు ముంపుకు గురైయ్యే సమస్యను పరిష్కరించనంతవరకు మా ఊరిలో ఎటువంటి ఎన్నికలు, ఏ రాజకీయ పార్టీల ప్రచారాలు నిర్వహించడానికి వీలు లేదని చారకొండ మండల పరిధిలోని ఎర్రవెల్లి గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు. రిజర్వాయర్ నీటి నిలువ సామర్థ్యం తగ్గించి మా బ్రతుకులు కాపాడాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.
అందులో భాగంగా గతంలో అంబేద్కర్ విగ్రహం విగ్రహం వద్ద పలు డిమాండ్ లతో కూడిన ఫ్లేక్సీ అతికించారు. గురువారం బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవాల సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు గ్రామంలో జెండా దిమ్మెను ఏర్పాటు చేస్తుంటే నిర్వాసితులు అడ్డుకుని జెండా కర్రను తొలగించారు. మా సమస్య పరిష్కారించకుండా మా ఊరు లోకి ఏ పార్టీ నాయకులు రావద్దని హెచ్చరించారు.