నేతలకు ఏఐసీసీ ఆదేశం
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): యూత్ కాంగ్రెస్ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలెవరూ పాల్గొనవద్దని, ప్రచారం కూడా చేయవద్దని ఏఐసీసీ సూచించినట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్‌కుమార్‌గౌడ్ తెలిపారు. ఎం పీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీ సీ అధ్యక్షులు, సీనియర్ నాయకులు ఏఐసీసీ ఆదేశాలు పాటించా లని ఆయన కోరారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు పారదర్శకం గా జరిగేందుకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులెవరూ అందులో భాగస్వామ్యం కావొద్దని ఏఐసీసీ ఆదేశాలిచ్చినట్లు ఆయన వివరించారు. యువజన ఎన్నికలు ప్రజస్వామ్యబద్ధంగా, సజావుగా జరిగేలా ప్రతిఒక్కరు సహకరిం చాలని ఆయన కోరారు.