నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆసుపత్రులు
కరీంనగర్, డిసెంబరు 23 (విజయ క్రాంతి): కరీంనగర్ జిల్లాలో 500 పైచిలుకు ప్రైవేట్ ఆసుప్రతులున్నాయి. ఒక్క ప్రభుత్వ ప్రధాన ఆసుప్రతి చుట్టే వందకుపైగా ప్రైవేట్ ఆసుపత్రులు ఉంటాయి. 70 ఆసుపత్రుల వరకు ఎలాంటి అనుమతులు లేకుండా నడుస్తున్నాయి.
చాలా ఆసుపత్రులు మెడి కల్ కౌన్సిల్ నిబంధనలను తుంగలో తొక్కి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల పేరుతో వైద్యం చేస్తూ చిన్న వైద్యానికైనా లక్షకు తగ్గకుండా ఫీజులు వసూలు ఇష్టారాజ్యంగా వ్యవహరి స్తున్నా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ చూసీచూ డనట్లు వ్యవహరిస్తున్నది. చాలా ఆసుపత్రు లు ప్రధాన రోడ్లపైనే ఉన్నాయి.
చాలా ఆసుపత్రులు కనీసం పార్కింగ్ లేకుండానే, ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకుండానే నిర్మాణాలు కొనసాగించారు. రోడ్డుపైనే వాహనాలను పార్కింగ్ చేస్తుండడంతో ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రి మూడు వైపులా రహదారులు నిత్యం ట్రాఫిక్ రద్దీతో ఉంటున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్లో రోగి ఆసుపత్రికి రావాలంటే కూడా సమయానికి చేరుకోలేని పరిస్థితి నెలకొంటుంది.
అంబులెన్సులు సైతం ఆసుపత్రుల ముందే నిలుపుతున్నారు. రోగుల వాహనాలు, ఓపీ పేషెంట్ల వాహనాలు ఆసు పత్రుల ముందే పార్కింగ్ చేయవలసి వస్తు న్నది. దీంతో ట్రాఫిక్ పోలీసులు ఫోటోలు తీసి చలాన్లు విధించడంతో రోగులకు వచ్చేవారు, రోగులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది.
కార్పొరేట్ పేరుతో ఉన్న ఆసు పత్రులు కనీసం ఫైర్ సేఫ్టీ నిబంధనల ప్రకారం కూడా భవనాలను నిర్మించలేదు. అగ్ని ప్రమాదం సంభవిస్తే ఫైరింజన్ సెల్లార్లోకి కూడా పోలేని విధంగా నిర్మాణా లున్నాయి. కొన్ని ఆసుపత్రులవారైతే సెల్లార్ల లోనే కార్యాలయాలను ఏర్పాటు చేసి మిగతా ఫ్లోర్లలో వైద్య సేవలు అందిస్తున సందర్భాలున్నాయి.
2021లో కరోనా సమయంలో వరుస మృతి సంఘటనలను దృష్టిలో పెట్టుకొని జిల్లాలో ఒక ఆరు ఆసు పత్రుల మాత్రమే నోటీసులు ఇచ్చి ప్రభు త్వం చేతులు దులుపుకుంది. కొన్ని ఆసుప త్రులవారు రిజిస్ట్రేషన్ గడువు ముగిసినా రిన్యూవల్ లేకుండా నెట్టుకువస్తు న్నారు.
అర్హత లేనివారు నిర్వహణ
కరీంనగర్ మంచిర్యాల చౌరస్తాలో ఒక ఆర్‌ఎంపీ వైద్యుడు ఏకంగా హాస్పిటల్ ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నారు. చాలా మంది నిరుపేదలు ఈ ఆసుపత్రిలో తెలియ కచేరి అవస్థలు పడుతున్నారు. జిల్లాలో 50కి పైగా ఆసుపత్రులను ఎలాంటి వైద్య విద్య చదవనివారు ఎండీలుగా ఉండి నిర్వహిస్తు న్నారు. కొన్ని ఆసుపత్రులు పీఆర్వోలను నియమించుకొని ఆర్‌ఎంపీల ద్వారా రోగు లను తమ ఆసుపత్రులకు రప్పించుకొని, అవసరం ఉన్నా లేకున్నా వైద్య పరీక్షలు నిర్వ హిస్తూ రోగుల నుంచి డబ్బులు దండుకుం టున్నారు. ఆర్‌ఎంపీల కు కమిషన్లు ఇస్తూ ఈ దందా కొనసాగిస్తున్నారు.
ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలి
జిల్లా కేంద్రంలో చాలా ఆసుపత్రులు పార్కింగ్ స్థలాలు, ఫైర్ సేఫ్టీ లేకుండా నిర్వహిస్తున్నారు. వీటన్నిటిపై చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికా రులు, మున్సిపల్ అధికారులకు ఫిర్యా దులు చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్నారు. చాలా ఆసుపత్రులు నిబంధన లకు విరుద్ధంగా నడుపుతూ రోగుల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. కనీస అరత లేనివారు కూడా ఆసుపత్రు లను నిర్వహిస్తుండడంతో వైద్యంలో నాణ్యత లోపించి ప్రజలు అనారోగ్యా లకు గురవుతున్నారు. ఇప్పటికైనా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు స్పందిం చి నిబంధనలు పాటించిన ఆసుపత్రు లపై చర్యలు తీసుకోవాలి.
ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రాహ్మణపల్లి యుగేందర్