calender_icon.png 28 December, 2024 | 12:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిందీతో వేరే భాషలకు పోటీ లేదు

15-09-2024 12:19:02 AM

  1. అన్ని భాషలు సోదరుల్లాంటివి 
  2. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడి

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 14: దేశంలోని ఇతర భాషలకంటే హిందీని ఎక్కువగా అభివృద్ధి చేయాల్సి ఉన్నదన్న తన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావటంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట మార్చారు. దేశంలోని భాషలన్నీ సోదర సమానమైనవేనని వివరణ ఇచ్చారు. హిందీ భాషా దినోత్సవం సందర్భంగా శనివారం ఆయన ఓ వీడియో సందేశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశా రు. ‘భారతీయులంతా ఒకే భాషలో సంభాషించుకోవాలని రాజ్యాంగ నిర్మాతల సంక ల్పం. అది హిందీ కావచ్చు, తమిళ్ కావచ్చు, తెలుగు కావచ్చు.

హిందీని బలోపేతం చేయ టం ద్వారా ఈ భాషల సమగ్రత పెరుగుతుంది. అన్ని భాషలూ మన సంస్కృతి, చరిత్ర, సాహిత్యం, గ్రామర్, సంస్కారాలను ముందుకు తీసుకెళ్తాయి. ఈ ఏడాది హిందీ దినోత్సవం ఎంతో ప్రత్యేకం. 1949 సెప్టెంబర్ 14న రాజ్యాంగ సభ భారత యూనియ న్ అధికార భాషగా హిందీని ఆమోదించింది. నేటితో ఆ ఘట్టానికి 75 ఏండ్లు నిండి నందున అధికార భాష డైమండ్ జూబ్లీ ఉత్సవాలు నిర్వహించుకోబోతున్నాం. ఈ 75 ఏండ్లలో హిందీ ఎన్నో ఆటుపోట్లు చవిచూసింది. ఏ ప్రాంతీయ భాషతోనూ అధికార భాషకు పోటీ లేదని కచ్చితంగా చెప్పగలను. అన్ని భారతీయ భాషలకు హిందీ స్నేహితురాలు అని పేర్కొన్నారు.