స్టేడియం ఎదుట స్థానికుల ఆందోళన
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 31(విజయక్రాంతి): గోషామహల్ పోలీస్ స్టేడి నూతన ఉస్మానియా ఆస్పత్రిని నిర్మించొద్దని స్థానికులు శుక్రవారం నిరసన తెలిపారు. స్థానికులు అభ్యంతరం తెలుపుతున్నప్పటికీ సీఎం రేవంత్‌రెడ్డి ఆస్పత్రికి శంకు చేయడాన్ని నిరసిస్తూ గోషామహల్ పరిరక్షణ సమితి ఆధ్వరయలో బంద్ పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా గోషామహల్ పరిరక్షణ సమితి సభ్యులు, షాహి చ్ బేగంబజార్, అఫ్జల్‌గంజ్, సుల్తాన్‌బజార్, మంగళ్‌హాట్ పోలీస్ స్టేషన్ల పరిధి బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులను పోలీసులు ముందస్తుగా పలువురిని గృహని అరెస్ట్ చేశారు.
అయినప్పటికీ గోషామహల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో స్థాని పలుమార్లు ఆందోళన తెలిపేందుకు ప్రయత్నించారు. పోలసులు వారిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇరుకైన చోట ఉస్మానియా ఆస్పత్రిని నిర్మించడం వల్ల తాము, రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవా వస్తుందన్నారు.
ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఆస్పత్రిని నిర్మిస్తే సహించబోమని హెచ్చరించారు. కార్పొరేటర్ లాల్‌సింగ్, గోషామహల్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు వినోద్ యాదవ్, బీజేవైఎం నాయకులు.. రాము, టీడీపీ నాయకులు దినేశ్, బీఆర్‌ఎస్ నాయకులు దత్తు, అశోక్ తదితరులు పోలీస్ స్టేడియం ముందు నిరసన తెలిపారు.