09-02-2025 01:13:18 AM
దరఖాస్తులు నిలిపివేస్తున్నట్టు ప్రకటించలేదు: ఎన్నికల సంఘం
హైదరాబాద్, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి) : తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు, చేర్పులు, మార్పులకు బ్రేక్ అంటూ వస్తున్న వార్తలపై ఎన్నికల కమిషన్ శనివారం క్లారిటీ ఇచ్చింది. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులను, తప్పుల సవరణను నిలిపి వేస్తున్నామంటూ ఎన్నికల కమిషన్ ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని స్పష్టం చేసింది. ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పలు వార్తాసంస్థలు కథనాలు ప్రసా రం చేసిన విషయం తెలిసిందే. దీనిపై వివరణ ఇస్తూ తాజాగా ఈసీ ప్రకటన జారీ చేసింది.