calender_icon.png 8 October, 2024 | 7:41 PM

ఏ ఒక్కర్నీ నిరాశపర్చదు

05-10-2024 12:00:00 AM

సుహాస్, సంగీర్తన హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న సినిమా ‘జనక అయితే గనక’. సందీప్‌రెడ్డి బండ్ల దర్శకత్వంలో శిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్‌రెడ్డి, హన్షితరెడ్డి నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్ 12న విడుదల కానుందీ చిత్రం. ఈ నేపథ్యంలో చిత్రబృందం విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించింది. దిల్ రాజు మాట్లాడుతూ.. “హ్యాపీడేస్’, ‘శతమానం భవతి’ ఓవర్సీస్‌లో ముందుగా రిలీజ్ చేశా.

ఆ సెంటిమెంట్‌తోనే ‘జనక అయితే గనక’ను అక్టోబర్ 10న ఓవర్సీస్‌లో రిలీజ్ చేస్తున్నా. 11న ఇక్కడ ప్రీమియర్లు వేసి.. 12న థియేటర్లలో విడుదల చేయనున్నాం. మా సినిమా పూర్తి వినోదాత్మకంగా సాగుతుంది’ అని చెప్పారు. హీరో సుహాస్ మాట్లాడుతూ.. ‘మా చిత్రం ఏ ఒక్కర్నీ నిరాశపర్చదు’ అన్నారు. ‘మా మూవీ టీజర్, ట్రైలర్లకు మంచి స్పందన వచ్చింది. సినిమా కూడా అందరికీ నచ్చుతుంది’ అని హీరోయిన్ సంగీర్తన తెలిపింది.