ధర్మ, ఐశ్వర్యశర్మ హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘డ్రింకర్ సాయి’. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరీధర్ నిర్మించారు. దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి తెరకెక్కించారు. ఈ నెల 27న విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లతో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో శనివారం నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో హీరో ధర్మ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాతో నేను యూత్‌ను చెడగొట్టలేదు అనే పేరొచ్చింది చాలు. ఒక మంచి మెసేజ్‌తో మూవీ చేశాం. మహిళలకు, ఫ్యామిలీస్‌కు మూవీ నచ్చడం సంతోషంగా ఉంది. మా మూవీని ఆదరిస్తున్న మహిళా ప్రేక్షకుల కోసం టికెట్స్‌ను ఉచితంగా ఇవ్వబోతున్నా’ అని తెలిపారు. హీరోయిన్ ఐశ్వర్యశర్మ మాట్లాడుతూ.. ‘సినిమాను ప్రేక్షకులతో కలిసి సినిమా చూశాను.
వాళ్లు ఫన్, ఎమోషన్.. ఇలా ప్రతి సందర్భంలోనూ బాగా రెస్పాండ్ అవుతున్నారు’ అని చెప్పారు. డైరెక్టర్ కిరణ్ తిరుమలశెట్టి మాట్లాడుతూ.. ‘మా మూవీలో హీరో ఒక తప్పు చేస్తాడు.. అది తెలుసుకునేలోగా నష్టం జరుగుతుంది.
అలా మీలో ఎవరి లైఫ్‌లో జరగొద్దనే మంచి సందేశాన్నిస్తూ ఈ మూవీ చేశాను. ఆడియెన్స్ నుంచే రివ్యూస్ తీసుకోబోతున్నాం. ఈ కాంటెస్ట్ ద్వారా సెలెక్ట్ అయిన వారికి డ్రింకర్ సాయి 31న మంచి పార్టీ ఇస్తాడు’ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్లు శ్రీనివాస్, లహరీధర్, డీవోపీ ప్రశాంత్ అంకిరెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీవసంత్, యాక్టర్ రాజేశ్‌వుల్లి, డిస్ట్రిబ్యూటర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.